Mega 158:చిరు 158లో సారా!

4
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా శంకర్ వర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో మరోసారి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఉత్సాహంలో ఉన్న చిరు, సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘విశ్వంభర’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ మెగా 158, దీనికి బాబీ దర్శకత్వం వహించనున్నాడు.

ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్ర కోసం ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కథలో కీలక మలుపులు తిప్పేలా ఉండబోతుందని, భావోద్వేగాల పరంగా కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మెగా 158 చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా, స్టార్ టెక్నీషియన్లతో గ్రాండ్ స్కేల్‌లో సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా మెగా అభిమానులకు మరో భారీ విందు ఖాయమనే చెప్పాలి.

Also Read:మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు

- Advertisement -