బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సినీ జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయని ఆమె చెప్పింది. ఓ హీరోతో గతంలో తాను సన్నిహితంగా ఉన్నాను అని, కానీ సడెన్ గా ఆ హీరో కొన్ని నెలలు తర్వాత తనను పక్కన పెట్టడం మొదలు పెట్టాడని.. ఇదే విషయం పై నీలదిస్తే.. చాలా హేళనగా మాట్లాడాడు అని సారా అలీఖాన్ తెలిపింది. ఆ హీరో విక్కీ కౌశల్ అని తెలుస్తోంది. ఇక తన సినిమాల పై కూడా సారా అలీఖాన్ ఓపెన్ కామెంట్స్ చేసింది. తాను చేయబోయే ఏ రోల్కైనా ఇంపార్టెన్స్ లేకపోతే.. అలాంటి చిత్రాల్లో నటించనని సారా చెప్పింది.
రూ.500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తాను. ఇంపార్టెన్స్ లేని సినిమాలో చేసి అది సూపర్ హిట్ అయినా అలాంటి సినిమాల వల్ల తనకు గుర్తింపురాదని సారా అలీఖాన్ చెప్పుకొచ్చింది. నిజానికి సారా అలీఖాన్ సినిమాల్లోకి రాకముందు బాగా లావుగా ఉండేది. ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండేవి. అయినా, అవన్నీ లెక్క చేయకుండా సారా అలీఖాన్ హీరోయిన్ గా మారింది. బాగా తగ్గింది. నటన పై మక్కువ పెంచుకుంది.
Also Read:హ్యాపీ బర్త్ డే…తిరుపతి లడ్డు!
పైగా ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకోవడానికి ఎన్నో కసరత్తులు చేసింది. అలాగే అందాల ఆరబోతలో కూడా ఎలాంటి మొహమాటలు లేకుండా రోజురోజుకు రెచ్చిపోయింది. నిన్న కూడా సారా అలీఖాన్ లెహెంగాలో సెక్సీగా కనిపిస్తున్న తన లేటెస్ట్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇండియా కౌచర్ వీక్ 2023లో కూడా సారా తన కిల్లర్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఆకర్షించింది. ఈ ఫొటోలకు గ్లామ్ ఫర్ ది గ్రామ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇంత కష్టాలు పడి సినిమాలు చేస్తున్నా.. ఎందుకో సారా ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతుంది.
Also Read:ఎన్టీఆర్ vs బన్నీ.. పోటీ తప్పదా?