జోగినపల్లి సంతోష్‌కుమార్ బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ క్రమంలోనే రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సంతన్నకు గవర్నర్ కంగ్రాట్స్ చెప్పారు.
సంతోష్ కుమార్‌తో పాటు బడుగుల లింగయ్య యాదవ్ , బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాగా..వచ్చే నెలలో వీరు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.
ఇదిలా ఉండగా…తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమాల్లో పాల్గొన్నారు సంతోష్‌కుమార్. ఆయన కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ సంతోష్ కుమార్‌ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే 32 ఓట్లతో రాజ్యసభ సభ్యుడిగా ఘనవిజయాన్ని సాధించారు సంతోష్.
కాగా..రాజ్యసభ్యుడిగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తూ..ఆయన ఆశీస్సులు పొందారు సంతోష్‌కుమార్. తెలంగాణ అభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తానని, తనను గెలిపించిన వారందరికీ శిరస్సువంచి సమస్కరిస్తున్నానంటూ చెప్తూ..బావోద్వేగానికి లోనయయ్యారు.