ఓటీటీలోకి సంతోష్!

4
- Advertisement -

పోలీస్ ప్రొసీజరల్ క్రైమ్ డ్రామా  సంతోష్ కు ప్రశంసలు లభించినప్పటికీ, భారత్‌లో థియేట్రికల్ విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి నిరాకరించింది. పోలీసుల దౌర్జన్యం, కుల వివక్ష, స్త్రీద్వేషం వంటి అంశాల ప్రదర్శనపై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.

బ్రిటిష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంద్యా సూరి రచించి, దర్శకత్వం వహించిన “సంతోష్”.. ఓ యువతి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరి ఓ దళిత యువతి హత్యను విచారించే కథ. భారతదేశంలో థియేట్రికల్ రిలీజ్ జరగకపోయినా, ఇప్పుడు ఈ చిత్రం OTTలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అక్టోబర్ 17 నుండి Lionsgate Playలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రానికి OTTలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. సంతోష్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అదేవిధంగా యుకె తరఫున ఆస్కార్‌లోని ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీకి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అలాగే, BAFTAలో బెస్ట్ డెబ్యుట్ ఫీచర్ విభాగంలో నామినేషన్ కూడా సాధించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో షహానా గోస్వామి, సునీతా రాజ్వర్ నటించారు.

Also Read:ముషీర్ ఖాన్‌తో పృథ్వీ షా..ఫైట్!

- Advertisement -