కీసరలో సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

15
- Advertisement -

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం అమృత కాలంలో కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లో మహా శివుడికి ప్రత్యక పూజలు నిర్వహించి,అభిషేకం చేశారు మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక MLA మల్లారెడ్డి వారి కుటుంబ సభ్యులు.

ఈ రోజు శివరాత్రి పార్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి అభిషేక కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ఉండాలని కోరుకోవడం జరిగింది. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కీసర గుట్ట ఆలయ పరిధిలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ గారు, కీసర గుట్ట మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, BRS స్థానిక నాయకులు మహేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Also Read:కాంగ్రెస్‌పై వ్యతిరేకత..బీఆర్‌ఎస్‌దే గెలుపు!

- Advertisement -