లిటిల్ ఏంజిల్..క్యూటెస్ట్ ప్రేయర్: ఎంపీ సంతోష్

289
mp santhosh
- Advertisement -

మరికొద్దిరోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ ఓ చిన్నారి అల్లాను ప్రార్ధిస్తున్న వీడియోని షేర్ చేశారు. కరోనాతో అంతా సతమతం అవుతున్నామని తన బుడ్డిబుడ్డిమాటలతో కరోనాను నియంత్రించాలని చేసిన ప్రార్ధన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

ఇక రంజాన్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక గైడ్ లైన్స్ విడుదల చేసింది. 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని – కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు – క్రిస్టియన్ చర్చిలతోపాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

మసీదులని మూసివేసి ఉంచాలని ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని తెలిపింది. లాక్ డౌన్ సమయం ముగిసే వరకు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -