న్యూ ఇయర్..మొక్కను నాటిన మాజీ ఎంపీ సంతోష్

6
- Advertisement -

నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కను నాటారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ నేడు ఒక మొక్కను నాటడం జరిగింది. ఇది చిన్న చర్యలా కనిపించినప్పటికీ, దీని వెనుక పెద్ద లక్ష్యం దాగి ఉంది అన్నారు.

మనం నాటే ప్రతి మొక్క, తీసుకునే ప్రతి పర్యావరణహిత నిర్ణయం రాబోయే తరాలకు పచ్చదనం నిండిన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.మనమంతా కలిసి ముందుకు సాగితేనే మంచి భారత్‌ను నిర్మించగలుగుతాం.పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా, పర్యావరణ సంరక్షణే మార్గంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక మొక్కను నాటాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు..

Also Read:ది రాజా సాబ్‌..మారుతి ఫుల్ కాన్ఫిడెంట్!

 

- Advertisement -