మహిళా సోదరిమనులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(సంతన్న). ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి ప్రతీకే (ఉమెన్స్ డే) అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుంచీ ఇప్పటిదాకా కేసీఆర్ వెన్నంటే ఉంటున్న ఏకైక వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. దాదాపు రెండు దశాబ్దాల కాలం పార్టీలో ఏ పదవి లేకున్నా.. ఉద్యమంలో తానూ కేసీఆర్కు వెన్నంటి నడిచారు. నడుస్తూనే ఉన్నారు. పద్దెనిమిదేళ్ల తర్వాత.. 2017లో సంతోషన్నకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు కేసీఆర్. అంతేకాదు.. ఈ పదవినిచ్చి యేడాది తిరక్కముందే.. ఏకంగా కేంద్రంలో పెద్దల సభ రాజ్యసభకు పంపించారు తెలంగాణ సీఎం.