సూపర్ స్టార్ Vs స్టైలిష్ స్టార్@సంక్రాంతి

491
mahesh-babu
- Advertisement -

ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతయాన్న సంగతి తెలిసిందే. 2020సంక్రాంతికి మాత్రం ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా అల..వైకుంఠపురంలో. ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై భారీగా అంచనాలున్నాయి. అల్లు అరవింద , రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను 2020జనవరి 12విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈమూవీ నుంచి విడుదలైన సామజవరగమన సాంగ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేవ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలీం సిటిలో జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈమూవీని కూడా జనవరి 2020, 12వ తేదిన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో బాక్సాఫిస్ వద్ద హడావుడి నెలకొలననుంది. సంక్రాంతి రేసులో మరి ఎవరు నెగ్గుతారో చూడాలి.

- Advertisement -