సంక్రాంతి పండుగ తేదీపై నెలకొన్నిసందిగ్ధాన్ని తొలగించింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 14వ తేదీ రాత్రి 7:15 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి
ప్రవేశిస్తాడని.. ఆ మరుసటి రోజు 15వ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకోవాలని స్పష్టం చేశారు. 14 భోగి, 16 కనుమ అని స్పష్టం చేశారు.
ఇదివరకు జరిగిన జ్యోతిష సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారిని విద్వత్సభ ప్రతినిధి బృందం కలిసి సంక్రాంతి సెలవులకు సంబంధించిన పత్రాన్ని అందజేసింది.
సోషల్ మీడియాలో పండుగపై పుకార్లు వచ్చిన సందర్భంగా వాటిలో ఎటువంటి వాస్తవం లేదని విద్వత్సభ స్పష్టం చేసింది. పంచాంగం ప్రకారమే తాము ఈ తేదీలను ఇదివరకే ప్రకటించామని.. వాటి ఆధారంగానే ప్రభుత్వం కూడా సెలవులను ప్రకటించిందని సిద్ధాంతి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 15వ తేదీనే సంక్రాంతి పండుగగా గుర్తించినట్లు రమణాచారి వెల్లడించారు.