సంక్రాంతికి వస్తున్నాం..రూ.45 కోట్ల గ్రాస్

2
- Advertisement -

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ సినిమా ఉత్తర అమెరికాలో ప్రత్యేకంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే $700K మార్కును దాటిన ఈ చిత్రం, త్వరలోనే ఒక మిలియన్ డాలర్ల మార్కుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ సెంట్రిక్ కథ, బంధుత్వం అనుభూతిని కలిగించే పాత్రలు, హాస్యం, డ్రమా మేళవింపు ఈ చిత్ర విజయానికి కారణమయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో విడుదల కావడం, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది.

వెంకటేశ్‌ కామెడీ టైమింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దారు. హీరోయిన్‌లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. F2, F3 చిత్రాల తరువాత వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Also Read:నామినేషన్‌ వేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

- Advertisement -