సంక్రాంతి పండుగ.. ఎందుకంత ప్రత్యేకం !

34
- Advertisement -

మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రల్లో సంక్రాంత్ అని ఇలా ఆయా రాష్ట్రాల్లో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. అయితే ఎన్ని పేర్లు పిలిచినప్పటికి ఈ పండుగను అన్నీ రాష్ట్రాల్లో కూడా జనవరి 14 లేదా 15 తేదీల్లో మాత్రమే జరుపుకుంటారు. సాధారణంగా సూర్యుడు ఏడాదిలో 12 రాశుల్లో సంచరిస్తాడు. అలా సంచరించిన ప్రతిసారి సంక్రమణం అంటారు. జనవరిలో ధనుస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దక్షిణ వైపు నుంచి ప్రయాణించిన సూర్యుడు ఉత్తర దిక్కులోకి ప్రవేశిస్తాడు అందుకే సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు.

సూర్యుడు గమన దిశను మార్చుకోవడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సంక్రాంతి పండుగ సమయానికి పండించిన పంట చేతికి వస్తుంది. ఇంటి నిండా ధాన్యం ఉంటుంది. అందుకే రైతులు ఆనందంతో సంక్రాంతిని జరుపుకుంటారు. పిండి వంటలు చేయడం కొత్తగా పెళ్ళైన జంటలను ఇంటికి ఆహ్వానించడం చేస్తారు. అంతే కాకుండా ఇంట్లో బంధువులు కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళతో ఇల్లంతా కూడా సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుంది.

ఇంకా అచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముందు ముత్యాల ముగ్గులు తెలుగు సంప్రదాయాన్ని, ఆచారాలను ఉట్టి పడేలా చేస్తాయి. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగలా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి భారతీయులకు ఎంతో ప్రత్యేకం. అయితే ఈ సంక్రాంతి పండుగను కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా; జరుపుకుంటారు. అమెరికాలో సంక్రాంతి పండుగను ‘ థాంక్స్ గివింగ్ ‘ పేరుతో జరుపుకుంటారు. చైనాలో కూడా మూన్ ఫెస్టివల్ పేరుతో జరుపుకుంటారు. అలాగే ఇజ్రాయిల్ లో ‘సుక్కోట్ ‘, పోర్చుగల్ లో ‘ఫ్లవర్ ఫెస్టివల్ ‘.. వంటి పేర్లతో ఆయా దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు.

Also Read:సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?

- Advertisement -