ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు బుమ్రాకే రావాలి!

2
- Advertisement -

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ వార్డు బుమ్రాకే రావాలని శాంసన్ వెల్లడించారు.

శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.భారీ లక్ష్యాన్ని చేధించడానికి దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలోనే వికెట్లు కొల్పోయినా బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను చివరి వరకు పోరాడాడు.

ఈ మ్యాచ్‌లో కీలక ఘట్టం డెత్ ఓవర్లలో భారత బౌలింగ్. ముఖ్యంగా బుమ్రా వేసిన 16వ మరియు 18వ ఓవర్లు మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశాయి. ఆ రెండు ఓవర్లలో బుమ్రా వరుసగా కేవలం 8 మరియు 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మ్యాచ్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ..ఈ రోజు మా జట్టు ఎలా ఆడిందో చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ విజయానికి ప్రధాన కారణం బుమ్రా. అతను వరల్డ్ క్లాస్ బౌలర్, ఒక తరం లో ఒక్కసారి మాత్రమే వచ్చే బౌలర్. నిజానికి ఈ అవార్డు అతనికే ఇవ్వాలి. డెత్ ఓవర్లలో మేము అలా బౌలింగ్ చేయకపోతే నేను ఇక్కడ నిలబడే అవకాశం ఉండేది కాదు. కఠిన పరిస్థితుల్లో కూడా బౌలర్లు తమపై నమ్మకం ఉంచి బాగా బౌలింగ్ చేశారు అని శాంసన్ చెప్పారు.

Also Read:వృషకర్మ..బెస్ట్ మూవీ!

- Advertisement -