- Advertisement -
యూపీలో బీఎస్పీ మాయావతి,మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీ వల్లే బీజేపీ విజయం సాధించిందని శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ అన్నారు. నాలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీ గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపిన సంజయ్…వారి గెలుపు వల్ల మాకు ఎలాంటి నష్టం, బాధ లేదు అన్నారు.
సీఎం, ఇద్దరూ డిప్యూటీ సీఎం లు ఎందుకు ఓడిపోయారు..? అనేది బీజేపీ చెప్పాలన్నారు. జాతీయ భావజాలంతో కూడిన బిజెపి పార్టీ పంజాబ్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నించిన సంజయ్…ప్రధానమంత్రి నుంచి అందరూ పంజాబ్లో ప్రచారం చేసినా ఎందుకు గెలవలేదు.. పంజాబ్ ప్రజలు బిజెపిని తిరస్కరించారన్నారు.
ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కి సీట్లు మూడు రెట్లు పెరిగాయి….మాయావతి ఓవైసీ కాంట్రిబ్యూషన్ వల్లనే బిజెపి పార్టీ విజయం సాధించిందన్నారు. మాయావతికి ఓవైసీకి పద్మ విభూషణ్, భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
- Advertisement -

