బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ హీరో..!

340
balakrishna

బాలయ్య హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూలర్‌. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్‌కి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమా తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో మూవీ చేయనున్నాడు బాలయ్య.

గతంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జరుపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్‌ను తీసుకున్నట్టు సమాచారం. 2020 సమ్మర్‌కి సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. మరి బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మూవీతో వీరు హ్యాట్రిక్‌ హిట్ కొడతారా లేదా వేచిచూడాలి.