బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ `భూమి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన సంజయ్‌దత్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ కూడా ఇవాళ విడుదలైంది. ఇందులో సంజయ్‌దత్ తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోనే తండ్రిగా కనిపించారు. ఆయన కూతురిగా అదితీ రావ్ హైదరీ నటించారు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమా కథ మీద ఒక అభిప్రాయాన్ని కలిగించేలా ఉంది.
సంజయ్ దత్ జైలు నుండి వచ్చిన తర్వాత సినిమాల స్పీడు పెంచాడు. కొన్నాళ్ళుగా సంజయ్ దత్‌ని వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టైంలో మున్నాభాయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో భూమి అనే సినిమా చేస్తున్నాడు సంజయ్. భూమి చిత్రం తండ్రి, కూతురు నేపథ్యంలో రూపొందుతుంది. సందీప్ సింగ్ మరియు భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బేనర్ పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో సంజయ్‌దత్ నట విశ్వరూపం మరోసారి ప్రేక్షకులకు కనువిందు కలిగించనుంది. యాక్షన్ సన్నివేశాలు, తండ్రికూతుళ్ల మధ్య ఉన్న ఉద్వేగ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకానుంది.