ఫేర్‌వెల్ మ్యాచ్‌లో సానియా గెలుపు..

27
- Advertisement -

హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో జరిగిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎగ్జిబిషన్ మ్యాచ్ లో లో విజయం సాధించారు. ఈ మ్యాచ్ కు మంత్రి కేటీఆర్, నటుడు దుల్కర్ సల్మాన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మ్యాచ్ జరుగుతుండగా యువరాజ్ ను చూసి ఎక్సైటింగ్ గా ఫీలైన అభిమానికి క్యాప్ మీద సంతకం ఇచ్చి యూవీ అనందపర్చారు.

ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం సానియా ఒక్క‌సారిగా భావోద్వేగానికిలోనై కంట‌త‌డి పెట్టుకుంది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

2003లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించిన సానియా.. 43 డబ్ల్యూటీఏ డబుల్స్‌ టైటిల్స్‌ ,6 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ చేజిక్కించుకుంది. ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆఫ్రోఆసియా గేమ్స్‌ ఇలా అన్నింట్లోనూ మెడల్స్‌ చేజిక్కించుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -