సానియా..మంజ్రేకర్ ట్విట్టర్ వార్…

258
- Advertisement -

విమెన్ డబుల్స్ టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య ట్వీట్టర్ యుద్ధం నడిచింది. భారత టెన్నిస్‌ డబుల్స్‌ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్‌ విభాగంలో నెంబర్‌ వన్‌గా 80 వారాలు పూర్తి చేసుకుని అరుదైన మైలురాయికి చేరుకుంది. 29 ఏళ్ల సానియా మీర్జా 8885 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, మాజీ పార్టనర్‌ స్విస్‌ టెన్నిస్‌ తార మార్టినా హింగిస్‌ 8560తో రెండో స్థానంలో నిలిచింది. 80 వారాలు ర్యాంకింగ్‌లో కొనసాగడంపై అందరి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతు ట్విట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సంజరు మంజ్రేకర్‌ ట్విట్‌లో డబుల్స్‌లో కదా అంటూ వ్యంగ్యంగా అభినందనలు తెలపడంపై ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. నెంబర్‌ వన్‌ అంటే డబుల్స్‌లో కదా  కంగ్రాట్స్‌ అంటూ ట్విట్‌ చేయడం సానియా కోపం తెప్పించింది. నేను సింగిల్స్‌ ఆడటం లేదనే కదా నెంబర్‌ వన్‌ ర్యాంకు అర్ధమని ఆమె జవాబిచ్చింది. ఆ మాత్రం కామన్‌సెన్స్‌ లేదా అని ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా కామన్‌సెన్స్‌ లేదంటావా అంటూ మంజ్రేకర్‌ ఫైరయ్యాడు.

mirza
సానియా: నెంబర్ వన్ ప్లేయర్ గా ఇవాల్టితో 80 వారాలు పూర్తయ్యాయి. ఇదో గొప్ప ప్రయాణం నాకు. మరింత కష్టపడటానికి స్ఫూర్తినిస్తుంది.

మంజ్రేకర్: మీరనేది నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ గానేనా.. కంగ్రాట్స్

సానియా: సింగిల్స్‌ ఆడడం లేదంటే డబుల్స్‌ అనుకోవడమే కదా కామన్‌సెన్స్‌. కామన్‌ సెన్స్‌ అనేది అంత కామన్‌ కాదనుకుంటా

సానియా: అయినా నీ విషెస్ కు థాంక్స్

మంజ్రేకర్: నా లాంటి కామన్ సెన్స్ లేని వాళ్ల కోసం ముఖ్యమైన డిటేయిల్స్ ఇవ్వడం మీరు మర్చిపోయారు

సానియా: ఇదిగో ఇక్కడ చదువుకోండి ….

అంటూ WTA పోస్ట్ చేసిన ఆర్టికల్ లింక్ ను ట్వీట్ లో పోస్టు చేసింది.

మంజ్రేకర్: ఆ ఆర్టికల్ కూడా అదే చెబుతోంది కదా.. మీరు డబుల్స్ లో నెంబర్ వన్ అని. స్టంప్స్ కు అవతలగా వెళ్లే బాల్స్ ను వదిలేసినట్టు దీనికి ఇక్కడితో ముగింపు పలుకుదాం

ఇలా ఇద్దరూ మాటకు మాట ట్వీట్ చేసుకుంటూ యుద్ధమే చేశారు. మధ్యలో మరికొంత మంది సానియాకు మద్దతుగా నిలిచారు. నువ్వు సాధించినంత దానిలో ఇంచ్ కూడా సాధించని వాడితో ఎందుకీ తగాదా అంటూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.

manjrekar

manjre

nara

sania

mar

- Advertisement -