- Advertisement -
ఆస్టేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో రెండో మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడి ఓటమి పాలైంది. కజకిస్తాన్ భాగస్వామి అయిన అన్నా డానిలినాతో కలిసి ఆడిన సానియా 4-6,6-4,2-6 తేడాతో ఉక్రెయిన్ – బెల్జియన్ కు చెందిన కాలినినా,అలిసన్ వాన్ చేతిలో ఓటమి పాలైంది. దాదాపు రెండు గంటల పాటు ఈ పోరు సాగగా చివరకు సానియ జోడి ఓటమి పాలైంది. సానియాకు ఇది తన కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ.
వచ్చే నెలలో దుబాయ్ మాస్టర్స్ తర్వాత సానియా రిటైర్ కానుంది. అయితే మిక్స్డ్ గ్రాండ్ స్లామ్లో సానియా ఆశలు సజీవంగానే ఉన్నాయి. భారత్‌కు చెందిన రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్‌లో ఆడనుంది సానియా.
ఇవి కూడా చదవండి..
- Advertisement -