- Advertisement -
భారత మాజీ క్రికెటర్,హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ తనయుడు అసద్ పెళ్లి త్వరలో జరగనుంది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జాతో అసద్ వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ కన్ఫర్మేషన్‌ను ఇచ్చింది సానియా మీర్జా. ఢిల్లీలో ఓ టెన్నిస్ టోర్నీకి అతిథిగా హాజరైన సానియా… డిసెంబర్‌లో ఆనమ్ మీర్జా వివాహం ఉంటుందని వెల్లడించింది.
ఆనమ్ – అసద్ ఇద్దరు స్నేహితులు.కొద్ది రోజులుగా ఆనమ్.. అజారుద్దీన్ కుమారుడు అసద్ లవ్‌లో ఉన్నారు. అసద్ కంటే ఆనమ్ మూడేళ్లు పెద్దది.
2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత అసద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరు పెండ్లి చేసుకునే అవకాశముందని సమాచారం.
- Advertisement -