విజయశాంతికి కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి

201
Jaggareddy Vijashanthi

కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతికి కౌంటర్ ఇచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. యూపీఏ కూటమిలో సీఎం కేసీఆర్, చంద్రబాబులు క్రియాశీలంగా వ్యవహరించినా ఆశ్చరపొనక్కర్లేదని చెప్పారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయశాంతి. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తల్లో దైర్యం కొల్పోతామని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెలుతుందని ఆమె ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు.

తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు గాను నేడు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు జగ్గారెడ్డి. విజయశాంతి తనపై చేసిన వ్యాఖ్యలపై తాను కౌంటర్ ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఓ సినిమా నటిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందని.. కానీ ఆమె పార్టీ కోసం పనిచేస్తే మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. విజయశాంతికి పీసీసీ ఛీప్ కావాలనే కోరిక ఉందేమో అన్నారు. విజయశాంతి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమే అని..దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు చాలా అవసరం అన్నారు. జగ్గారెడ్డి చేసిన కామెంట్లపై విజయశాంతి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.