Harishrao:కాంగ్రెస్ డిక్లరేషన్‌ని ప్రజలు నమ్మరు

7
- Advertisement -

కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలు అనంతసాగర్, మల్కాపూర్, తోగర్లపల్లి, ముందేవులపల్లి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..సంగారెడ్డి అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని, అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలన్నారు. సంగారెడ్డి లో గెలిచిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సద్యమవుతుందన్నారు. కర్ణాటక లో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని విమర్శించారు.

Also Read:తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్!

అధికారం లోకి రావడానికి ఆపద మొక్కుల్లా హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక అభాసు పాలవుతోందన్నారు. కర్ణాటక లో బీజేపీ కి ప్రత్యమ్నాయం వేరే పార్టీ లేక కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మరని…నమ్మినందుకు కాంగ్రెస్ ఓటర్లను నట్టేటా ముంచిందన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం నయవంచన కర్ణాటక లో బయటపడిందన్నారు. తెలంగాణ లో కేసీఆర్ ను విమర్శించాలంటే తమ తమ రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలన్నారు. తమ రాష్ట్రాల్లో ఏదీ చేసినా చెల్లుతుందని ఇక్కడకొచ్చి ఏదీ మాట్లాడినా జనాలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు అని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీజేపీ మాయ మాటలకు లోంగే పరిస్థితి లేదన్నారు. ఇక బీఆర్ఎస్‌లో చేరిన వారిలో కొండాపూర్ మండలం కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఇందిరా రెడ్డి, కొండాపూర్ మండల బీజేపీ ఎక్స్ ఎంపీపీ యాదయ్య, తోగర్లపల్లి కాంగ్రెస్ ఎక్స్ ఎంపీటీసీ రాజు, కొండాపూర్ మండలం నుంచి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు 200 మంది కార్యకర్తలు చేరారు.కంది మండలం ఎద్దుల మైలారం గ్రామం నుండి మాజీ సర్పంచ్ దశరథ్ తో పాటు 50 మంది చేరారు.

Also Read:28న ‘స్కంద’ గ్రాండ్ రిలీజ్..

- Advertisement -