బంపర్ ఆఫర్‌..సల్మాన్‌ ఖాన్‌తో సందీప్‌ వంగ..!

619
Sandeep Vanga
- Advertisement -

అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు సందీప్ వంగ. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాసింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ వసూళ్లతో ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్‌.

ఇక ఇదే మూవీని ఏకంగా బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టి భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న సందీప్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. టీ సిరీస్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్టులో సందీప్‌కు అవకాశం ఇచ్చింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తో చేసే అవకాశం కల్పించింది. సో, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -