మొదటి సినిమాతోనే టాలీవుడులో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌ని ఫిదా చేశాడు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా పలు భాషలలో రీమేక్ అవుతుంది. ఇక హిందీలోను అర్జున్ రెడ్డి చిత్రానికి సందీప్ రెడ్డి వంగనే దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే తమిళ నటుడు ధనుష్ ఈ సినిమా తమిళరీమేక్ హక్కులను దక్కించుకోగా. కన్నడ హక్కులను ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ దక్కించుకున్నాడు.
అయితే సందీప్ రెడ్డి వంగ తన తదుపరి చిత్రం ఎవరితో చేయనున్నారని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తల గురించి సందీప్‌రెడ్డి వంగ స్పందించారు.అవును నిజంగానే నేను మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నానని తెలిపారు. ఇటీవలె మహేష్ బాబుని కలిసి కథ వినించాయనన్నారు. హిందీలో అర్జున్‌రెడ్డి రీమెక్ పూర్తిచేసిన తర్వాత మహేష్ సినిమాకి సంబంధించిన
స్ర్కిప్ట్ వర్క్ మొదలుపెడతానన్నారు.
అయితే మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండు ప్లాఫ్ల తర్వాత మహేష్‌కి భారీ హిట్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్ కార్యక్రమం కోసం చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. మహేష్ తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి.. ఆ తర్వాతి సినిమా సుకుమార్‌తో చేయనున్నారు. అంటే వచ్చే సంవత్సరం మహేష్-సందీప్‌రెడ్డి వంగ ప్రాజెక్టు సెట్స్‌పై వెళ్లనున్నట్లు తెలుస్తుంది.