శాండ్ ఆర్ట్‌తో సందేశం.. ఎంపీ సంతోష్ ట్వీట్‌..

401
sand art
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు నిరంతరం పాటు పడుతున్న డాక్టర్లు,నర్సులు,పోలీసులు,జర్నలిస్టుల సేవలను స్మరిస్తూ ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ ఇసుకతో రాసిన సందేశాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కొనియాడారు. ఈ సాండ్ ఆర్ట్‌తో వేణుగోపాల్ అద్భుతమైన సందేశాన్ని అందించాడంటూ.. కరోనాపై పోరులో ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు ఎంపీ సంతోష్‌.

నగరానికి చెందిన శాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ కరోనా మహమ్మరిని బారిన పడకుండా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు వినూత్నంగా ఆలోచించారు. సృజనాత్మక పద్ధతిలో చెబితే ప్రజలకు మరింత చేరువవుతుందని వేణుగోపాల్ ఈ విధంగా శాండ్‌ ఆర్ట్‌తో కరోనా రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ వీడియోను ఎంపీ సంతోస్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -