సంచార్ సాథి యాప్‌..ఫీచర్స్ ఇవే!

7
- Advertisement -

సంచార్ సాథి యాప్‌ ని అన్ని ఫోన్లలో తప్పనిసరి చేసింది కేంద్రం. సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, మొబైల్ తయారీదారులు 120 రోజులలోపు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌ (DoT) కి కంప్లయన్స్ రిపోర్టులు సమర్పించాల్సి ఉంది. నవంబర్ 28న విడుదల చేసిన కొత్త ఆదేశాలలో భాగంగా, భారతదేశంలో అమ్మకానికి వస్తున్న అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో 90 రోజుల లోపు ‘సంచార్ సాథి’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉండాలని DoT ఆదేశించింది.

భారతదేశంలో వినియోగం కోసం తయారయ్యే లేదా దిగుమతయ్యే ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌లో, ఈ ఆదేశాల వెలువడిన 90 రోజుల లోపు, DoT సూచించినట్లుగా సంచార్ సాథి యాప్ తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలి. దేశంలో Apple, Samsung, Google, Vivo, Oppo, Xiaomi వంటి ప్రధాన కంపెనీలు ఫోన్లను తయారు చేస్తుండగా, వీరందరూ ఈ ఆదేశాలకు లోబడి ఉంటారు.

ఇప్పటికే తయారైన ఫోన్లు, విక్రయించిన ఫోన్లలో సంచార్ సాథి యాప్‌ను సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రూపంలో పంపాలని DoT సూచించింది. అనుసరించని కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 మరియు ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని DoT హెచ్చరించింది.

అలాగే:

ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్ ఫస్ట్ యూజ్ సమయంలో స్పష్టంగా కనిపించాలి.

యాప్ ఫంక్షన్లను డిసేబుల్ చేయకుండా ఉండాలని కంపెనీలకు ఆదేశించింది.

ఇప్పటికే వినియోగదారుల చేతుల్లో ఉన్న పరికరాల విషయంలో?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న, ఇప్పటికే అమ్మిన ఫోన్లలోకి యాప్‌ను ఎలా పంపుతారని స్పష్టమైన ఆదేశాలు ఇంకా వెలువడలేదు.

Also Read:సమంత రెండో పెళ్లిపై సద్నా సింగ్

సంచార్ సాథి యాప్ – ముఖ్య ఫీచర్లు

మొబైల్ ఫ్రాడ్‌ను నివారించడానికి కీలక సాధనం.

IMEI దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయవచ్చు.

మొబైల్ IMEI నిజమైనదో కాదో చెక్ చేయవచ్చు.

మోసపూరిత కాల్స్‌ను రిపోర్ట్ చేయవచ్చు.

పోయిన మొబైల్ వివరాలు నమోదు చేసే అవకాశం ఉంది.

చట్టపరమైన శిక్షలు

టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం:

IMEI మార్పు నాన్-బెయిలబుల్ నేరం

3 సంవత్సరాల వరకు జైలు శిక్ష,

₹50 లక్షల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.

ఈ విధంగా, దేశవ్యాప్తంగా అన్ని మొబైల్ పరికరాల్లో సంచార్ సాథి యాప్‌ను తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

- Advertisement -