యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సంయుక్త!

3
- Advertisement -

వరుస బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6ని నిర్మించనున్నారు. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

వెంకీ కుడుముల, కోన వెంకట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్‌ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ “హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం. 6 ఓపెనింగ్ కి వచ్చిన మీడియా మిత్రులకు థాంక్ యూ. ఈ ఆరో సినిమా ఒక మిరాకిల్ గా జరిగింది. సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్ లో ఇదే ఫస్ట్ . అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ వున్న సినిమా ఇది. సంయుక్త ఓకే అంటేనే ఈ సినిమా చేద్దామని అనుకున్నాను.కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాని చేయబోతున్నాం. మిగతా విషయాలన్ని టీజర్ లాంచ్ సందర్భంగా తెలియజేస్తాము’ అన్నారు

దర్శకుడు యోగేష్ కెఎంసి మాట్లాడుతూ – ”ఈ కథ, చిత్రానికి రాజేష్ దండా, సంయుక్త గారు కీలకం. కథ నచ్చి వెంటనే చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కథ ఎంతలా నచ్చిందని చెప్పడానికి ఉదాహరణ సంయుక్త గారు ఈ సినిమాని ప్రెజెంట్స్ చేస్తున్నారు. సంయుక్త లాంటి గుడ్ పెర్ఫార్మర్ తోనే ఈ సినిమా చేయాలని రాజేష్ గారు నిశ్చయించుకున్నారు. ఇదంతా దైవ సంకల్పం. మిగతా విషయాలు టీజర్ లాంచ్ టైం లో చెప్తాము’ అన్నారు.

Also Read:సీతారామచంద్ర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ ”అందరికీ ధన్యవాదాలు. రాజేష్ గారు చెప్పినట్లు ఈ సినిమా ఒక మిరాకిల్ లానే జరిగింది. ఈ కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్ గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను, కథ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు కొన్ని ఇయర్స్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపార్మెంట్ సబ్జెక్ట్స్ వుంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ వున్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు. అంత మంచి కథ.

ప్రస్తుతం, నేను ఐదు చిత్రాలను షూట్ చేస్తున్నాను, ఈ కథ విన్నప్పుడు ఆడ్రినలిన్ రష్ అనిపించింది. కథ చాలా నచ్చింది. రాజేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ యోగేష్ గారు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు వున్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ మ్యాన్ పవర్, ఫిజికాలిటీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది కథ’ అన్నారు

దర్శకుడు యోగేష్ KMC ఒక పవర్ ఫుల్ కథను రాశారు, ఇది థ్రిల్లర్ జానర్‌లో కొత్త పాయింట్. దర్శకుడు సంయుక్తను డైనమిక్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కొన్ని బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని చేయబోతున్నారు.ఈ చిత్రం అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.

- Advertisement -