#BSS12లో సంయుక్త

2
- Advertisement -

యాక్షన్-హల్క్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ #BSS12, ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తోంది. హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సంయుక్త పాత్రను సమీరాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్లాస్ షెల్ఫ్‌లపై రకరకాల నిర్మాణాలు కనిపిస్తుండగా, ఇంటెన్స్ లుక్స్ తో కూడిన మోడరన్ అమ్మాయి లుక్‌లో సంయుక్త అద్భుతంగా కనిపించింది.

ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోంది. ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. శివేంద్ర కెమెరామ్యాన్, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

Also Read:ఆకట్టుకుంటున్న ‘దేవర’ ట్రైలర్

- Advertisement -