“సముద్రుడు” షూటింగ్ పూర్తి..!

439
avantika
- Advertisement -

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంఫై బదావత్ కిషన్ నిర్మాతగా నగేష్ నారదాసి దర్శకత్వంలో నిర్మిస్తున్న “సముద్రుడు” చిత్రం నిరాటంకంగా 25 రోజులపాటు చీరాల ఓడరేవు సముద్ర తీరంలో రెండవ షెడ్యూల్ ముగించింది. 3 పాటలు మినహా పూర్తి షూటింగ్ ముగిసిందని.అతి త్వరలో పాటలు ఫారిన్‌లో చిత్రికరణ జరుగుతుందని దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు. చీరాల ప్రజలు చూడటానికి వెల్లువలా తరలివచ్చిన అక్కడి ప్రజలు కానీ పోలీస్ వ్యవస్థ గాని, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ తదితర పెద్దలు సంపూర్ణంగా సహకరించారని తెలిపారు.

ఈ చిత్రం ఆధ్యంతం అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చిందని నిర్మాత తెలిపారు. మత్సకారుల బ్యాక్ డ్రాప్‌లో పూర్తి కమర్షియల్ హంగులతో చిత్రికరణ జరిగిందని తెలిపారు.ఈ చిత్రానికి శ్రీ రామోజు జ్ఞానేశ్వర్,సోములు,రామారావు లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Samudrudu

ఈ చిత్రంలో రమాకాంత్ హీరోగా భాను శ్రీ (బిగ్ బాస్), అవంతిక లు హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్, రామరాజు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ,(జూనియర్) రాజశేఖర్, చిత్రంశ్రీను, శ్రావణ్, జబర్దస్త్ శేషు, రాజప్రేమి, తేజరెడ్డి, దిల్ రమేష్, డానియెల్, మల్లేష్, ప్రభావతి, గణేష్, కిషోర్, సిరిరాజ్ తదితరులు నటిస్తున్నారు.

సంగీతం:సుభాష్ఆనంద్,కెమెరా:వాసు,ఫైట్స్:సతీష్,నందు,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,డాన్స్:అనీష్,ఎడిటింగ్:బుల్ రెడ్డి,నిర్మాత:బదావత్ కిషన్,కధ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:నగేష్ నారదాసి.

- Advertisement -