సంపూ మార్క్ …. ‘కొబ్బరిమట్ట’

417
Sampu .. Kobbari Matta latest news
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే ఎక్క‌డ లేని ఇమేజ్ సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్‌ బాబు. హృద‌య‌ కాలేయం, సింగం 123 సినిమాల‌తో డిఫ‌రెంట్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బర్నింగ్‌ స్టార్‌కు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అటు సైడ్‌ క్యారెక్టర్స్‌ మరోవైపు హీరోగా బిజీగా ఉన్న సంపూ తాజాచిత్రం కొబ్బ‌రిమ‌ట్ట‌. కొద్ది రోజులుగా టీజ‌ర్ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న కొబ్బ‌రిమ‌ట్ట ఇప్పుడు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో అంద‌రికి షాక్ ఇస్తోంది.  రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆది కుంభగిరి, సాయి రాజేష్‌ నీలం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 మార్చిలో కొబ్బరిమట్ట విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Sampu .. Kobbari Matta latest news

ఈ సినిమాకు జ‌రుగుతున్న బిజినెస్ చూస్తుంటే టాలీవుడ్‌లో ఓ మీడియం హీరో సినిమాల‌కు ఏ రేంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుందో ఆ స్థాయిలో జ‌రుగుతుండ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని సైతం మెప్పించిన కొబ్బ‌రిమ‌ట్ట టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తూ సంపూర్ణేష్ బాబు క్రేజ్ చాటి చెప్పింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సంపూ షాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చిత్రమైన హేర్ స్టైల్.. జిగేల్ జిగేల్ డ్రెస్సులో భలే హుషారుగా ఉన్నాడు సంపూ. ఈ చిత్రంలో సంపూ ఇంకో రెండు పాత్రలు కూడా చేస్తున్నాడు. ఒకటి పాపారాయుడు.. ఇంకోటి పెదరాయుడు. ‘హృదయ కాలేయం’ తరహాలోనే ఇది కూడా పేరడి మూవీ. ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండైన సంపూ కొబ్బరిమట్టతో విడుదల తేదీ వరకు ఇంకెన్ని సంచలన వేషాలతో ముందుకు వస్తాడోనని నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

- Advertisement -