బిగ్ హౌస్‌ నుంచి పారిపోయిన సంపూ…

229
Sampoo Exits Bigg Boss show
- Advertisement -

తెలుగు నాట ఇప్పుడు బిగ్‌బాస్‌ రియాలిటీ షోను చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. ‘మా’ టీవీలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి వారం పూర్తి చేసుకుని రెండవ వారంలోకి ప్రవేశించింది. తొలివారం నటి జ్యోతి బిగ్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ కాగా ఎలిమినేషన్ రౌండ్ రాకుండానే హీరో  సంపూర్ణేశ్‌ బాబు బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి పారిపోయాడు. నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను పంపించేయండి అంటూ కంటతడి పెట్టుకున్న సంపూ తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక పోయాడు.

సంపూ….బిగ్ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఈ నాలుగు గోడల మధ్య ఉండటం అస్సలు ఇష్టం లేదని తొందరగా డోర్స్ ఓపెన్ చేయకపోతే నేనే ఏం చేస్తానో నాకే తెలియదంటూ చేతికి వచ్చిన వస్తువులను ఇసిరేశాడు సంపూ. ఉదయం నుండి సాయంత్రం వరకూ వెయిట్ చేసినా బిగ్ బాస్ స్పందించక పోవడం‌పై ధనరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. సంపూ నేను చచ్చిపోతున్నా అంటూ ఫైర్ కావడంతో కన్ఫూజన్‌ రూంకి పిలిచారు బిగ్ బాస్.

మీ సమస్య ఏంటని బిగ్ బాస్ అడగటంతో నేను ఎప్పుడు సింగిల్‌గా లేనని కుటుంబానికి దూరంగా ఎప్పుడూ ఉండలేనని ఇక్కడే ఉంటే ఏమైతోననే భయంతో నిద్రకూడా పట్టడం లేదని బిగ్ బాస్‌కి చెప్పడంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించారు. కాంట్రాక్ట్ మధ్యలో వదిలేయడంతో బిగ్ బాస్ తీసుకునే ఆర్థిక చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి సంపూ సిద్ధం కావడంతో బిగ్ బాస్ హౌస్ నుండి పంపించాము అని మిగిలిన సభ్యులకు బిగ్ బాస్ తెలియజేశారు.

- Advertisement -