మొక్కలు నాటిన చర్లపల్లి జైల్ సూపరిండెంట్..

49
Sampath planted 37 saplings

తన 37వ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చర్లపల్లి జైల్ ఆవరణంలో చిన్నారులతో కలిసి 37 మొక్కలు నాటారు చర్లపల్లి జైల్ సూపర్డెంట్ మాదారపు సంపత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సందర్భంలో ఐన మొక్కలు నాటడం కోసం ప్రయత్నం చేయాలి అని పిలుపునిచ్చారు. నా 37 వ పుట్టినరోజు సందర్భంగా 37 మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగి ప్రపంచం అంతా విస్తరించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. అందుకోసం నీను టీం Agamiకి, నా మిత్రులు నరేంద్ర, సురేంద్రనాథ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన 37 వ జన్మదినం సందర్భంగా 37 మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచిన జైల్ సూపర్డెంట్ సంపత్‌ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించడం జరిగింది.