రివ్యూ: సమ్మోహనం

307
Sammohanam-Review
- Advertisement -

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరిలు జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా కాకుండా  గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన అనగనగా పబ్లికేషన్స్‌ ద్వారా తన బొమ్మల పుస్తకాన్న విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. సర్వేష్(సీనియర్‌ నరేష్‌), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్‌. ఆ సినిమాలో హీరోయిన్‌ సమీరా రాథోడ్‌ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్‌ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది..? అన్నదే మిగతా కథ.

Sammohanam-Movie-

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేసింది.  కథనంలో ఫ్లో తగ్గుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ లేదా ఫన్ సీన్ వస్తూ సినిమాను గాడిలో పెట్టాయి.ఇక హీరో తండ్రి పాత్రలో నరేష్ అద్భుతంగా నటించారు.  సినిమాకు ఈ పాత్ర నటన మరొక హైలెట్. ఆ పాత్రపై వచ్చే ప్రతి సీన్ బాగా నవ్వించింది. పాత్ర ఒక ఎత్తైతే అందులో నరేష్ గారి నటన మరొక ఎత్తు. ప్రతి 10 నిముషాలకొకసారి కనిపించే ఆయన ఏ సందర్భంలో కూడ బోర్ కొట్టలేదు. మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఇంద్రగంటి సెకండాఫ్ లో కూడ భావోద్వేగాల్ని బాగానే పలికించారు.

మైనస్ పాయింట్స్ :

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ఫస్టాఫ్ ను అన్ని విధాలా బాగానే నడిపిన ఆయన కీలకమైన చోట్ల సన్నివేశాలను సాగదీశారు ముఖ్యంగా క్లైమాక్స్ ను అవసరం లేనంత పొడవుగా రాశారు.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాకు దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దరాయన. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం చూపరులకు వినసొంపుగా ఉంటుంది. పాటలన్నీ సూపర్‌ గా ఉన్నాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. మార్తాండ్ కె వెంకటేష్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

Sammohanam-Movie-

తీర్పు :

సినిమాల మీద పెద్ద‌గా ఒపీనియ‌న్ లేని హీరోకీ, న‌ట‌నే ప్రాణంగా భావించి స‌క్సెస్‌లో ఉన్న అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ‌. పేరుకి ఇది ప్రేమ క‌థే అయినా సినిమా ఆద్యంతం ఎక్క‌డికక్క‌డ ఉప‌న‌దుల‌ను క‌లుపుకొని ప్ర‌వ‌హించే జీవ‌న‌దిలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త కామ‌న్‌గా ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు గొప్ప‌ద‌నం గురించి, సినిమా వాళ్ల‌ను చూసి మామూలు జ‌నాలు చెప్పుకొనే మాట‌ల‌ను చాలా రాశారు. మొత్తానికి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విడుదల తేది:15/06/2018
రేటింగ్: 3/5
నటీనటులు: సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత‌లు: శివలెంక కృష్ణప్రసాద్
ద‌ర్శ‌క‌త్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి

- Advertisement -