ఎస్ ఎంఎస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యాడు సుధీర్ బాబు. అద్బుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. కొత్త కొత్త కథలను చేసుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా సమ్మోహనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సుధీర్ బాబు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు, తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పాడు. మహేశ నేను ఎప్పడు కలిసినా ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటామన్నారు. అంతేకాకుండా వ్యాయమం, డైట్ , ఫిట్ నెస్ గురించి మాట్లాడుకుంటామని చెప్పారు. మేము ప్రతిరోజు కలవకపోయినా వారంలో ఒక రోజు అయినా కలుసుకుంటాం అన్నారు. ఎప్పుడైనా టైం దొరికితే తప్పకుండా కలుస్తామన్నారు. పండగలు వచ్చినప్పుడు తప్పకుండా మామామయ్య కృష్ణ ఇంటికి వెళ్లి చేసుకుంటామన్నారు.
తాము ఎక్కువగా సినిమా విషయాలు మాట్లాడుకుంటామన్నారు. తాను ఏసినిమా కు సైన్ చేసినా ఆకథను తప్పకుండా మహేశ్ చర్చిస్తానన్నారు. కథలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తాను తనకు చెబుతాడన్నారు. మహేశ్ కొన్ని మార్పులు చేసినా కానీ చివరగా నిర్ణయం తానే తీసుకుంటానని తెలిపారు. మొదట్లో సినిమా రంగంలోకి వస్తానంటే మహేశ్ వద్దని వారించాడని తెలిపారు. నా మొదటి సినిమా ఎస్ ఎమ్ఎస్ సినిమా చూసి మహేశ్ మెచ్చుకున్నారన్నారు.