‘సమ్మతమే’ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఇంటర్వ్యూ..

67
- Advertisement -

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న సమ్మతమే సక్సెస్ విశేషాలివి.

ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ మీకు ఎంతవరకు సమ్మతం ?
ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ పూర్తిగా సమ్మతమే.

సమ్మతమే కథ ఆలోచన ఎలా వచ్చింది ?
ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ వుండాలని అనుకున్నాను. సమ్మతమే పాయింట్ బావుంటుందని మొదట ఈ లైన్ అనుకోని తర్వాత పూర్తి స్థాయిలో బిల్డ్ చేశా.

మీ నేపధ్యం ?
నేను ఎంబీఏ చేశాను. ఇంటర్ తర్వాత అన్నపూర్ణలో మూడు నెలల ఫిల్మ్ క్రాష్ కోర్స్ చేశాను. డిగ్రీ చేస్తూ షార్ట్ ఫిల్మ్ చేసి, ఎంబీఏ చేస్తూ కథ రాసుకొని ఎంబీఏ పూర్తవ్వగానే సినిమా మొదలుపెట్టాను.

షార్ట్ ఫిలిమ్స్ కి బిగ్ స్క్రీన్ కి తేడా వుంది కదా.. మొదటి సినిమాకే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది?
మొదట ఒక గంట కంటెంట్ ని యంగేజింగా చేస్తున్నానలేదా అని చెక్ చేసుకున్నాను. ఒక మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకోస్తాననే నమ్మకం కుదురిన తర్వాతే సమ్మతమే మొదలుపెట్టాను.

సమ్మతమే పై వచ్చిన విమర్శ ఏంటి ?
ఫ్లాట్ నేరేషన్ అని అన్నారు. అయితే ఫ్లాట్ నేరేషన్ కూడా ఒక నేరేషన్ స్టయిలే. నాన్ లీనియర్ గా అక్కడిది ఇక్కడ కట్ చేసి జంప్స్ చేసి చెప్పొచ్చు. ఇలా ఐతే కథానాయకుడితో కనెక్షన్ మిస్ అయిపోతుంది. అతడి ఎమోషన్ ని ఆడియన్ ఫీల్ అవ్వలేడు. అందుకే చాలా వరకూ ఫ్లాట్ నేరేషన్ స్టయిల్ ని ఫాలో అయ్యా.

ఈ సినిమాని మీ అమ్మగారు నిర్మించారు కదా.. సినిమా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి చర్చ జరిగింది ?
ఈ రోజు కీ మా నాన్న మనకి సినిమాలు ఎందుకు, అక్కడ ఎవరూ తెలీదు కదా అని అంటారు. నేనే ఇంట్లో కన్విన్స్ చేసి మొదలుపెట్టా.

బిజినెస్ పరంగా హ్యాపీనా ?
చాలా హ్యాపీ. ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పను గానీ పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది.

‘సొసైటీ బాలేన్నప్పుడు మారాల్సింది సొసైటీ గానీ అమ్మాయిలు కాదు’ సినిమాలో ఈ డైలాగ్ హంట్ చేసింది. ఇది మంచి పాయింట్ కదా .,.దిన్ని ఎందుకు బలంగా చెప్పే ప్రయత్నం చేయలేదు ?

ఒక విషయాన్ని పాత్ర చెప్పినట్లు ఉంటేనే బావుంటుంది. దాన్ని బలవంతంగా హైలెట్ చేస్తూ చెబితే రుద్దుతున్నట్లు వుంటుంది. కొన్ని డైలాగులు బలంగా ఉంటాయని నాకు ముందే తెలుసు. అయితే క్యాజువల్ గా చెబితేనే దాని ఇంపాక్ట్ వుంటుంది. ఈ రోజు దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే కారణం అదే.

మరీ లైటర్ వెయిన్ లో చెప్పారనే భావన కలుగుతుంది కదా ?
బేసిగ్గా సినిమా కథలు డబ్బులు, హత్యలు, కుట్రలు, పగలు, మోసాలు చుట్టే ఎక్కువగా తిరుగుతాయి. వర్షం పడే ముందు చల్లగాలికి రైడ్ మీద వెళ్లే ఒక ఆహ్లాదకరమైన సినిమా తీయాలని అనుకున్నా. లైటర్ వెయిన్ ఎమోషన్స్ అందరిలోనూ వుంటాయి. వాటిని ద్రుష్టి లో పెట్టుకొని కథ చేయాలనేది నా ఆలోచన.

పెళ్లి చూపుల్లో అవమానించిన అబ్బాయి,,. తర్వాత సీన్ లోనే ఆ అబ్బాయి ప్రేమలో అమ్మాయి పడినట్లు చూపించడానికి కారణం?
నిజంగా ప్రేమించడానికి కారణాలు వుండవు. ఒక అమ్మాయి ఎందుకిష్టం అంటే అప్పుడు కారణాలు వెదుక్కుంటారు కానీ ప్రేమించడానికి కారణాలు వుండవు. కారణం కంటే ముందు పుట్టేదే ప్రేమ.

ఈ కథ ముందు ఎవరికైనా చెప్పారా ?
లేదండీ. నేను,కిరణ్ అన్నదమ్ముల్లా వుంటాం. తనతో ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నా. రాజా వారు రాణి గారు తర్వాత ఈ సినిమా చేయాలి. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్ లో తను ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశారు. దీని తర్వాత సమ్మతమే మొదలుపెట్టాం.

కిరణ్ కూడా రైటర్ కదా.. కథ విషయంలో ఎలాంటి చర్చలు జరుగుతాయి ?
రైటింగ్ పరంగా మా ద్రుష్టి కోణాలు వేరువేరు. రచయితలుగా పరస్పరం గౌరవించుకుంటాం.

రాజాగారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం ఇమేజ్ మారింది కదా.. దానికి తగ్గట్టు కథలో ఏమైనా మార్పులు చేశారా ?
దాన్ని ద్రుష్టిలో పెట్టుకొని భారీ స్కేల్ లో ఓ సాంగ్ చేశాం. కానీ ఎడిట్ లో తీసేశాను. ఫ్లో కి అస్సలు మ్యాచ్ కాలేదు. సినిమా అంతా ఆర్గానిక్ గా వుంది కానీ ఈ పాట మాత్రం చాలా ఫోర్స్ద్ గా అనిపించింది. అందుకే మరో ఆలోచన లేకుండా తీసేశాం.

సాంగ్ ని ఎడిట్ లో తీసేసినప్పుడు ఒక నిర్మాతగా ఎలా అనిపించింది ?
బడ్జెట్ పెట్టాం, కష్టపడ్డాం. అయితే ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. సినిమాకి అనవసరం అనుకుంటే తీసేయడమే ఉత్తమం.లేదంటే అదే ఒక వైరస్ గా మారి సినిమా అంతా తినేస్తుంది.

బడ్జెట్ పెరిగిందని వినిపించింది ?
మేము అనుకున్న దాని కంటే ఎక్కువే అయ్యింది.

శేఖర్ చంద్ర మ్యూజిక్ గురించి ?
శేఖర్ గారు చాలా సపోర్ట్ చేశారు. కొత్త వారమని ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. మంచి ఆల్బమ్ ఇచ్చారు.

ఎలాంటి స్పందన వస్తుంది ?
యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన స్పందన రావడం సర్ప్రైజ్ గా వుంది. ఇండస్ట్రీ నుండి కూడా చాలా అభినందించారు. రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సబ్జెక్ట్లు రెడీగా వున్నాయి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కథ కూడా వుంది. హీరోలంతా బిజీగా వున్నారు. వారి వీలు చూసుకొని మొదలుపెట్టాలి.

మీ నిర్మాణం లో చేస్తారా ?
ఏ ప్రాజెక్ట్ చేసిన నా వైపు నుండి కొంత పెట్టుబడి వుంటుంది.

ఎలాంటి కథలు చేయాలని వుంది?
అందరూ ఎంజాయ్ చేసేలా వుండే కథలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని వుంది

- Advertisement -