గద్దెనెక్కిన సమ్మక్క…

411
sammakka
- Advertisement -

తెలంగాణ కుంభమేళ, ఆదివాసీ జాతరలో అతిముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క నామస్మరణతో మేడారం మార్మోగింది. భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ బందోబస్తు మధ్య వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు.

సమ్మక్క రాక సందర్భంగా చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్న కిలోమీటరు దారి మొత్తం రంగురంగుల ముగ్గులు వేసి భక్తులు యాటపోతులను బలిచ్చి మొక్కుకున్నారు. సమ్మక్క నామస్మరణతో చిలుకలగుట్ట ప్రాంతం మార్మోగింది.

చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్నం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు.

- Advertisement -