రాహుల్ గర్వంగా ఉంది-సమంత

397
Samatha
- Advertisement -

సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చి॥ల॥సౌ॥’. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్ సరసన రుహానీ శర్మ నటించారు. నేడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

ChiLaSow Theatrical Trailer

అక్కినేని వారి కోడలు సమంత ‘తన మిత్రుడు రాహుల్ రవీంద్రన్ పట్ల గర్వంగా ఉందని, ఈ సినిమా కోసం ఎదురు చేస్తున్నానని ట్వీట్ చేసింది. ఇక మరో నటుడు బ్రహ్మాజీ.. షాక్ ఇచ్చావ్ సోదరా.. టీజర్ అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. మీ మూవీ కోసం ఎదురు చేస్తున్న.. నిజాతీయగా మీరు చేసిన కృషికి ఫలితం లభిస్తుంది అంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు హీరోయిన్ కాజల్. యంగ్ హీరో అడివి శేష్ కూడా ‘చి॥ల॥సౌ॥’ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

మరోవైపు అభిమానులు సైతం ట్రైలర్ సూపర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, అనుహాసన్ పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిరుణి సినీ కార్పొరేషన్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఆగస్టు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -