సామాన్యులపై భారమా..ఏంటిది మోడీజీ?

32
- Advertisement -

కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన తరువాత దేశం అభివృద్ది పథం లో ముందుకు సాగుతుందో లేదో తెలియదు గాని.. సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తరచూ నిత్యవసర ధరల పెరుగుదలతో పాటు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంటి ఇందన ధరలు కూడా భగ్గుమంటున్నాయి. బతుకు జీవుడా అని జీవనం సాగించే వారికి ఈ దరల పెంపు గుదిబండలా మారుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాక మునుపు పెట్రోల్ ధర రూ. 60- 70 ఉంటే.. ఇప్పుడు రూ.120 దాటి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక 2014 కంటే ముందు 40- 50 రూపాయల మద్య ఉన్న డీజిల్ ధర 100 రూపాయలు దాటుతోంది.

ఇక 2014 కంటే ముందు 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు 1000 రూపాయలు దాటి ఇంక పరుగులు పెడుతూనే ఉంది. ఇలా సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి దాని ధర ఆకాశాన్ని అంటుతుండడంతో ఛాలిచాలని జీతలతో జీవనం గడిపే వారికి జేబులు చిల్లు పడుతున్నాయి. ఇక తాజాగా మరోసారి వంటగ్యాస్ ధర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే గ్యాస్ పై ఉన్న సబ్సిడీ ఎత్తివేసిన తరువాత రూ. 1000 రూపాయలు పెట్టి కొంటున్నారు సామాన్యులు. ఇది చాలదు అన్నట్లుగా గతేడాది మరో రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించింది.

దాంతో వంట గ్యాస్ ధర రూ.1050 దాటింది. ఇప్పుడు తాజాగా మరో రూ. 50 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో గ్యాస్ కొనలంటే రూ.1100 నుంచి రూ.1200 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో మోడీ సర్కార్ పై సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలే కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇక పేదల సంగతి సరేసరి.. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాన్యులపై పెను భారం మోపుతుండడంతో మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయమని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి…

మోడీ టార్గెట్ మీరే..కేజ్రీవాల్ కు హెచ్చరిక!

జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కేంద్రాలు

- Advertisement -