సమంతా కోరికల చిట్టా…

237
Samantha
Samantha
- Advertisement -

సమంతా తన కోరికల చిట్టా విప్పింది. ఇప్పటి వరకు ఈ భామ దేవుడిని ఏ వరం కోరుకోలేదట. ఒక వేళ కోరినా పెద్ద పెద్ద కోరికలేం కోరదట. అవకాశాలు, కార్లు, బంగళాలు ఇలాంటి వాటి గురించి ఎప్పుడూ దేవుడి దగ్గర విన్నవించుకోలేదట. కానీ, ఒకేఒక్క కోరిక దేవుడిని కోరుతుందట. అది కూడా పరిస్థితుల్ని ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మొక్కుకుంటుందట.

ప్రతి ఒక్కరి జీవితాల్లో క్లిష్టమైన సమస్యలు వస్తుంటాయని, ఆ పరిస్థితుల్ని మనకు మనంగా ఎదుర్కోవాలని చెబుతుతోంది ఈ భామ. దానికి స్థైర్యం కావాలని, ఆ స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా దేవుడిని కోరుకుంటానంటోంది. తాను పరిష్కరించే సమస్యల్నే దేవుడు నాకు ఇస్తున్నాడని, కాబట్టి తన కోరికను దేవుడు తీర్చినట్టే కదా అని క్లారిటీ కూడా ఇస్తోంది. ఇకపైనా తన కోరికల చిట్టాలో ఈ కోరిక తప్ప వేరే కోరిక ఉండదని తేల్చి చెప్పేసింది ఆమె. మొత్తానికి సమంతది మంచి కోరికే కదా. కానీ, ఈ భామకు ఇంత చిన్న కోరిక ఉండడం ఆశ్చర్యంగానే ఉంది. అయినా అక్కినేని కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టనున్న సామ్ కు.. పెద్ద కోరికలు ఉండాల్సిన అవసరం ఏముందంటున్నారు ఫిల్మ్ లవ్వర్స్.3

- Advertisement -