కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ పేరుతో మొదలైన కొత్త ఛాలెంజ్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. సినీ సెలబ్రిటీలు, సామాన్యులు, క్రీడాకారులు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాజ్యవర్ధన్ తాను పుషప్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, క్రికెట్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ని సైనా, హృతిక్ స్వీకరించారు. ఆ తర్వాత పి.వి సింధు, కోహ్లి, అనుష్క శర్మ, నటుడు అఖిల్ తదితరులు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు.
సింధు సవాల్ స్వీకరించిన అఖిల్ తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్‌లకి ఈ సవాల్ విసిరాడు. వీరిలో చైతూ ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ లో సమంత, నిధి అగర్వాల్ , సుశాంత్ లు పాల్గొనమని కోరాడు .
ఈ సవాల్ కు సమంత స్పందించింది. ‘పుల్ అప్’ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘పుల్ అప్’ చేయమని చాలా ఏళ్లుగా నా ట్రైనర్ నాకు చెబుతుండేవారు. కానీ, నాకు తలనొప్పిగా ఉందని, కడుపునొప్పిగా ఉందని, పన్ను నొప్పిగా ఉందంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకునే దానిని. ఎట్టకేలకు, పుల్ అప్ చేసేందుకు ప్రయత్నించానని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది.. నా దృష్టిలో ఫిట్ నెస్ అనేది అందంగా కనిపించేందుకు కాదు.. క్రమశిక్షణ, గౌరవం, విశ్వాసం, శక్తి సామర్థ్యాల కోసం’ అని పేర్కొంది. ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు సవాల్ విసురుతున్నానని చెప్పింది.