టాలీవుడ్ జంట అక్కినేని నాగ చైతన్య – సమంత వీరి పెళ్లి ఎంత హడావిడిగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినీ తారల నుంచే కాకుండా సౌత్ జనాల నుండి ఎన్నో విషెస్ ని అందుకున్నారు. లవ్ చేసుకొని ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకోకుండా ఇద్దరి కుటుంబాల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్ళి తరువాత చైతూ సమంత ఎన్నో వేడుకలు జరుపుకున్నారు. పెళ్లైన దగ్గర్నుండి ప్రతిరోజు ఎదోఒక పార్టి జరుపుకునేవారు.
అయితే చై-సామ్ పెళ్లి తర్వాత మరో వేడుక రానే వచ్చింది. ఈ రోజు అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు. దీంతో సమంత పెళ్లి తర్వాత వచ్చిన మొట్టమొదటి బర్త్ డే అని శ్రీవారికి స్పెషల్ గా విషెస్ ని అందించింది. తన ఇన్ స్టాగ్రామ్ లో చెప్పిన బర్త్ డే విషెస్ ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.
సమంత క్రిస్టియన్ వెడ్డింగ్ నాటి ఫొటోని జత చేస్తూ..హ్యాపి బర్త్ డే నా సర్వస్వమా.. నేను విష్ చేయను కానీ నీ హార్ట్ ఏం కావాలని కోరుకుంటుందో అవన్నీ నెరవేరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. ఐ లవ్యూ ఫరెవర్.. అంటూ తన శ్రీవారికి సమంత స్వీట్ గా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో నెటిజన్స్ కూడా చాలా పాజిటివ్ గా సమంత విషెష్ పై కామెంట్ చేస్తూ.. చైతూకి విషెస్ ని తెలుపుతున్నారు. చైతు ప్రస్తుతం సవ్యసాచి మూవీలో నటిస్తున్నాడు.