కుక్క కావాలి..!!

229
Samantha wants a dog
Samantha wants a dog
- Advertisement -

పెళ్లి టైమ్ దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది సమంత. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ అందరితో టచ్‌లో ఉండే సమంతకు.. ఓ వీడియో తెగనచ్చేసింది. ఇంకేముందు నాకు కావాలంటూ ఏడుపు ఎమోజీలను పోస్ట్ చేసింది.

వివరాలళ్లోకి వెళ్తే.. ప్రముఖ న్యూస్‌ ఎడిటర్‌ లత శ్రీనివాసన్‌.. హీరోయిన్ సమంతకు ఓ పోస్ట్ షేర్ చేశారు. త‌న‌కు ట్విటర్‌లో షేర్ చేసిన ఆ పోస్ట్‌పై స్పందించిన హీరోయిన్‌ స‌మంత ‘నాకూ కావాలి’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను పోస్ట్‌ చేస్తోంది. ఇంత‌కీ ల‌త శ్రీ‌నివాసన్ షేర్ చేసిన ఫోస్ట్‌లో ఏముందంటే.. ఓ యువతి యోగా చేస్తుంటే ఆమె పెంపుడు కుక్క కూడా అదే ప‌నిచేస్తోంది. అంతేకాకుండా ఆమె యోగాస‌నాలు వేయ‌డానికి ఆ కుక్క స‌హ‌క‌రిస్తోంది కూడా. ఆ కుక్క చేస్తోన్న సాయం స‌మంతాకు బాగా న‌చ్చేసిందేమో.. ‘నాకూ కావాలి’ అంటూ ఇలా పోస్ట్ చేసింది.సమంత ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ‘నాకూ కావాలి’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను పోస్ట్‌ చేసిందంటే సమంతకి కూడా అలాంటి ఓ కుక్క కావాలేమో..!

- Advertisement -