డాన్స్‌తో దుమ్ములేపిన సమంత.. వీడియో

261
- Advertisement -

సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘యూటర్న్’. ఈ చిత్రం 2016లో కన్నడలో వచ్చిన ‘యూటర్న్’కి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తెలుగులోకి రీమేక్ చేశారు. ఇందులో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక, ముఖ్యమైన పాత్రలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు.

U Turn Movie

ఈ నేపథ్యంలో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ ఆలపించిన సాంగ్‌లో సమంత అదిరిపోయేలా డాన్స్ చేసింది. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల బిట్స్‌ను కూడా ఈ సాంగ్‌లో చూపించారు.

“దిశాల్ని మార్చుకున్నా .. ఎలాంటి దారుల్లో పోతున్నా .. మనస్సు మారుతున్నా .. గతాల జ్ఞాపకం ఏదైనా” అంటూ ఆల్బమ్ తరహాలో ఈ సాంగ్ కొనసాగుతోంది. ‘కర్మ థీమ్’ పేరుతో నెటిజన్ల ముందుకు వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -