సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండే టాలీవుడ్ భామ ఎవరంటే..టక్కున సమంత పేరే గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం సమంత హాబీ. అంతేకాదు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేసేస్తుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంచితే…ఇప్పుడీ బేబీ తనకు కాబోయే ముద్దుల మొగుడిపై తనకున్న ప్రేమను మరోసారి చూపించింది. ఇప్పటికే తన సినిమా విశేషాలతోపాటు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యపై ఉన్న ప్రేమను అనేక సందర్భాల్లో తెలిపింది శామ్.
తాజాగా చైతూను ఉద్దేశించి ట్వీట్ చేసింది సమంత. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుద్ధం శరణం’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. దీన్ని చైతూ ట్విటర్ వేదికగా పంచుకుంటూ.. ‘శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా… నేను ధైర్యంగా జీవించగలను’ అని ట్వీట్ చేశాడు.
దీనికి సమంత రీట్వీట్ చేస్తూ.. ‘నా హీరో చాలా గ్రేట్’ అని పొగిడేసింది. దీంతో చైతూ అంటే శామ్ కి ఎంత ప్రేమో మళ్ళీ తెలిసేలా చేసిందని నెటిజన్లు తెగ చెప్పేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే..‘యుద్ధం శరణం’ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నం.1 స్థానంలో ఉండటం విశేషం. 11 లక్షల మందికిపైగా టీజర్‌ను చూశారు. 24 వేల మంది లైక్ చేశారు.
https://www.youtube.com/watch?v=U0SrE_kMq2w