సమంత ప్లాన్‌.. కెవ్వు కేక..!

210
samantha turns brand ambassador for a tv channel
- Advertisement -

దీపమున్నప్పుడే ఇళ్ళుచక్కబెట్టుకోవాలి.. ఇది పాత సామెత. గ్లామర్‌ ఉన్నప్పుడే ఫుల్లుగా దండుకోవాలి..ఇది కొత్త సామెత. ఈ రెండో సామెత సినీస్టార్లకు పర్‌ఫెక్ట్ గా సెట్‌ అవుతుంది. అందులోనూ టాలీవుడ్‌ బ్యూటీ సమంతకి సరిగ్గా సెట్‌ అవుతుంది.

ఎందుకంటే..ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు యాడ్స్ లో నటిస్తూ.. ఇంకోవైపు ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంటున్నసామ్‌ ఇప్పుడు కొత్త క్యారెక్టర్ లో కనిపించనుంది.

samantha turns brand ambassador for a tv channel

తాజాగా ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్ కు ప్రచారకర్తగా ఉండేందుకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది సామ్‌. ఇప్పటివరకూ ఆ ఛానల్ ని ప్రచారం చేస్తున్నతమన్నా ప్లేస్‌ లోకి ఇప్పుడు సమంతా రానుంది. ఇకపై.. ఆ ఛానల్ కు సంబంధించిన సీరియల్స్.. సినిమాలకు సంబంధించిన ప్రచారాన్ని చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఇప్పటికే జరిగిపోయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే ఛానల్ కు సంబంధించిన వర్క్ లో పాల్గొన్నారని.. షూట్ కూడా చేశారని చెబుతున్నారు.

ఇక ఆ ఛానల్ కి ప్రచారకర్తగా సమంత చేసుకున్న ఒప్పందం సుమారు రూ.1.5కోట్లుగా ఉందని టాక్‌. సినిమా వాళ్లు ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల్లో యాడ్స్ ముఖ్యమైనవి అని వేరే చెప్పనక్కర్లేదు. మొత్తానికి..ఏ వేళకు ఏం జరగాలో.. ఫ్యూచర్ను ఎలా డిజైన్ చేసుకోవాలో సమంతకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలేమో.

- Advertisement -