మెగా ప్రాజెక్ట్ కు సైన్ చేసిన సమంత..!

182
Samantha
- Advertisement -

టాలీవుడ్ లో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ రాణించిన ముద్దుగుమ్మ సమంత. కానీ అమ్మడు త్వరలోనే ఓ ఇంటిది కాబోతుండడంతో నిన్నటి వరకు తెలుగు లో ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. సమంత ఇక హీరోయిన్ గా నటిస్తుందో లేదోనని అనుకునే లోపే…ఓ మెగా ప్రాజెక్ట్ సైన్ చేసింది. సుకుమార్- రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో సామ్ ఆఫర్ దక్కించుకుంది. చెర్రీతో ఆమెకి ఫస్ట్ ఫిల్మ్ ఇది. మ్యారేజ్ ఫిక్స్ తర్వాత ఆమె చేయనున్న తొలి తెలుగు మూవీ. మరో హీరోయిన్‌గా రాశిఖన్నా కనిపించనుంది. నటీనటుల ఎంపిక జరుగుతుండడంతో ఈనెల 30న పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి, ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో సామ్ రూరల్ అమ్మాయిగా కనిపించనుందని ఇన్‌సైడ్ సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు పని చేయనుండగా, దేవి‌శ్రీ మ్యూజిక్ సంగీతం అందిస్తున్నాడు.

Samantha

ధృవ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చరణ్‌ సుకుమార్ తో డిఫరెంట్ మూవీకి సిద్దమైయ్యాడు. మొదట ఈ సినిమాను సుకుమార్ స్టైల్లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి పల్లెటూరు బ్యా గ్రాప్ లో సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో చరణ్ డిఫరెంట్ లుక్ లో గడ్డంతో కన్పించనున్నాడు. అందుకే గడ్డం బాగా పెంచుతున్నాడు. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి..దసరా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత రోల్ కు మొదట అనుపమా పరమేశ్వరన్‌ అనుకున్నా..చివరికి ఆ అవకాశం సమంతను వరించింది.

- Advertisement -