స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో విడిపోయాక, తమ సంసారం గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసినా సూటిగా సుత్తి లేకుండా సామ్ అసలు విషయం చెప్పలేదు. కానీ, తాజాగా సమంత ‘నేను చేసిన అతిపెద్ద తప్పు అదే’ అంటూ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘సమంత తన వైవాహిక జీవితం గురించి స్పందించింది. ‘నేను నా దాంపత్య జీవితంలో అతని ఇష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను.
పైగా గతంలో నా మాజీ భాగస్వామి నన్ను ఎక్కువ ప్రభావితం చేశాడు. ఎందుకో తెలియదు, ఆ సమయంలో నా గురించి నేను తెలుసుకున్నాను. సంతోషం కన్నా జీవితంలో ఏదీ ముఖ్యం కాదు అనిపించింది. అలాంటి సంతోషం కోసం నేను ఎప్పుడూ సిద్దంగానే ఉంటాను. ఐతే, మన సంతోషం ఒక్కోసారి మనతో ఉన్నవారికి బాధ కలిగించొచ్చు. ఆ క్రమంలోనే ఆ తర్వాత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. ఐతే, ఆ క్లిష్ట సమయం నుంచే నేను విలువైన పాఠం నేర్చుకోగలను అని అర్థమైందని సమంత వెల్లడించింది.
పైగా ఈ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. ఇక ఈ విషయం గ్రహించిన తర్వాతే తన వ్యక్తిగత ఎదుగుదల మొదలైందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – నాగచైతన్య, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. మొత్తానికి చైతుతో విడిపోయాక కూడా సమంత అతని జ్ఞాపకాల నుంచి మాత్రం దూరం కాలేకపోతుంది. ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు దూరమై చికిత్స చేయించుకుంటోంది. ఆమె ప్రజెంట్ క్రయో థెరపీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read:KTR:పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ