నా ఫస్ట్ లవ్…సమంత షాకింగ్!

7
- Advertisement -

దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. మయోసైటిస్‌ బారిన పడి దాని నుండి కోలుకునేందుకు సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఇంతలోనే తన తండ్రి జోసెఫ్‌ ప్రభు హఠాత్తుగా మరణించడం ఇలా వరుస సంఘటనల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు సమంత.

ఇటీవలె వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్‌ : హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో మెరిసిన సమంత.. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ రక్త్‌ బ్రహ్మాండ్‌ షూట్‌లో జాయిన్ అయింది.

మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల సమంత స్పందించారు. ఇకపై విరామం తీసుకోనని ప్రకటించారు. యాక్టింగ్‌ తన ఫస్ట్‌ లవ్‌ అని పేర్కొన్నారు. సినిమాలు నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకు విరామం తీసుకోను. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. తిరిగి మీ సామ్ మీ ముందుకు వరుస చిత్రాలతో వస్తుంది అని ప్రకటించింది. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది.

Also Read:శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

- Advertisement -