నయనతారతో పోటీపడుతున్న సమంత

502
Samantha Nayanatara
- Advertisement -

అక్కినేని సమంత తన అందం, నటనతో టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో టాప్ హీరోలందరి సరసన ఆమె సినిమాలు చేసింది. సరైన కథలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న పెద్ద హీరోలని తేడా లేకుండా కేవలం కథ మీద నమ్మకంతో సినిమాలు చేస్తుంది సమంత.

ఇక ఈమధ్యలో సమంత నటించిన సినిమాలు వరుసగా హిట్లు అవుతుండటంతో ఆమె రెమ్యూనరేషన్ ను పెంచిందని తెలుస్తుంది. ఏకంగా ఈ భామ తన పారితోషకాన్ని రూ. 3 కోట్లకు పెంచేసిందట. ఓ బేబి సినిమాకు ముందు సమంతా రూ. 2 కోట్లు తీసుకుంటుండగా.. తాజాగా మరో కోటి పెంచినట్టుగా టాలీవుడ్ లో టాక్. ఎంత పెద్ద హీరోయిన్లయినా పారితోషకం మాత్రం హీరోల కంటే తక్కువే ఉంటుంది.

అయితే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వారిలో నయనతార మొదటి ప్లేస్ లో ఉండగా..సమంత రెండవ స్దానంలో ఉంది. నయనతార ఒక్కో సినిమాకు రూ.5కోట్లు తీసుకుంటోంది. నయనతార కూడా ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా బిజీగా ఉంది. ఆమె తర్వాత బిజీగా ఉన్న వాళ్లలో సమంత సెకండ్ ప్లేస్ లో ఉంది.

- Advertisement -