రంగస్థల నాయకి..!

255
Samantha In Rangasthalam 1985
Samantha In Rangasthalam 1985
- Advertisement -

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి ‘రంగస్థలం 1985’ టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్ఛమైన ప్రేమకథకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారన్నది సినిమా చూస్తే గానీ తెలిసేలా లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉండేలా, అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. సినిమా సెట్స్ పై ఉండగానే సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తను నటించే ప్రతి సినిమా గురించి అభిమానులతో షేర్ చేసుకునే సమంత అసలు చరణ్ సినిమాలో నటిస్తున్నట్లు ఒక ట్వీట్ కూడా చేయలేదు.

ఇటీవల కేవలం కాలి మువ్వలు కనిపించేలా దిగిన ఫోటోను పోస్టు చేసిన సమంత.. ఈ సినిమాకు సంబంధించిన రెండో ఫోటోను సమంత తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుండడంపై సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో నటించలేదని..వాస్తవికత ఎప్పుడూ అందంగా ఉంటుందని గోదావరి ఒడ్డున దిగిన ఓ ఫోటో షేర్ చేసింది. అందులో బాధ, సంతోషం పెద్ద విషయం కాదు…కానీ కెమెరా మాత్రం అద్భుతాన్ని చూపిస్తుందని పోస్టు చేసింది. ఈ ఫోటోలో సమంత లంగాఓణిలో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇది ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, జగపతిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

- Advertisement -